ప్రజా ప్రభుత్వంలో  విద్యకు పెద్ద పీట —డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

జనం పవర్, వనపర్తి, సెప్టెంబర్ 10 :

ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో విద్యకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఇలాంటి పరిస్థితుల్లో  గోపాల్ పేట్ మండలం బుద్ధారం గ్రామంలో గల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎలకలు కావడం దురదృష్టకరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు . బుద్ధారంలో గురుకుల పాఠశాలను సందర్శించి ఎలుకలు కరిచిన విద్యార్థులను పరామర్శించి , ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైతే  పాఠశాల సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. విద్యార్థులను అక్కడ పరిసరాలను , సమస్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
చిన్నారెడ్డి సమయం దొరికినప్పుడు గురుకులాలను తనిఖీ చేస్తానని వంట ఏజెన్సీ లపై ప్రత్యేక నిఘాను ముమ్మరం చేస్తూ  పౌష్టికాహారం అందజేయాలని సూచిస్తానని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడినంక  హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను, మెస్  చార్జీలను  పెంచి అండగా నిలిచిందని అన్నారు.దేశ భవిష్య నిర్మాణం అవుతున్న గురుకులాలలో చిన్న సంఘటనలపై ప్రతిపక్షాలు  విమర్శలు చేయొద్దని, విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని   అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  మన వనపర్తి పట్టణంలోని చదువుకున్న వ్యక్తి కావున విద్యాపరంగా ఏ సమస్య లైన పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు కావున అధైర్య పడకుండా చదువులో, ఆటలలో ప్రతిభ కనబరిచి వనపర్తి జిల్లాకు గుర్తింపు తేవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, న్యాయవాది ప్రకాష్ ,వనపర్తి మండల్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంట్ల రవి , ఎల్ల గౌడ్,పెద్దమందడి మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు  తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :