ఈ నెల 13న సిద్దిపేట విపంచి కళా నిలయం లో…
జనం పవర్, సిద్దిపేట, సెప్టెంబర్:10
– సిద్దిపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోగలరు..
సిద్దిపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శుభవార్త చెప్పారు.. సిద్దిపేట లో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 13న, మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది.. ఒక్క అడుగు బయటకు పెట్టండి.. మీ జీవిత ఆశయాన్ని సాదించండి.. ఎంత సేపు సిద్దిపేట లోనే ఉండి ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉంటా అనే మీ ఆలోచన నుండి బయట కు రావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు సిద్దిపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకుల కోసం జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నారు.. ఉద్యోగం చిన్నదా పెద్దదా అని కాకుండా ఎదో ఒక ఉద్యోగం చేస్తా కావాలి అనే తపన ఉండాలనే ఉద్దేశ్యం తో సిద్దిపేట లో ఈ నెల 13మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. 10 క్లాస్, నుండి ఇంజనీర్ చదివిన యువతి యువకులకు మంచి అవకాశాలు రానున్నాయ్.. ఈ జాబ్ మేళా లో 20 కంపెనీ లు 40 మంది హెచ్ ఆర్. లు పాల్గొంటారు..
ఆసక్తిగలవారు ఈ కరపత్రం లోని క్యూ ఆర్ కోడ్ లో రిజిస్టేషన్ కాగలరు…
ఇంజనీరింగ్ విద్యార్థుల కు టెక్ మహేంద్ర, టి సి ఎస్, ఇన్ఫోసిస్ కంపెనీ లు, ఐ టి ఐ వాళ్లకు ఎం ఆర్ ఎఫ్ కంపెనీ
స్థలం : విపంచి కళానిలయం,
బై పాస్ రోడ్డు సిద్దిపేట
ఇట్టి అవకాశాన్ని సిద్దిపేట నియోజకవర్గం యువత యువకులు సద్వినియోగం చేసుకోగలరు.









