జనం పవర్, వనపర్తి, సెస్టెంబర్ 10 :
ప్రభుత్వ ఆసుపత్రి వనపర్తి అద్వర్యములో బుధవారం ట్రాంజెడర్స్ కు ఆటల పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గోని ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం లో శంకర్ గౌడ్ మాట్లాడుతూ
కౌమార దశలోకి వచ్చిన కొంతమంది అబ్బాయిల్లో హార్మోన్ల మార్పుల కారణంగా అమ్మాయిల మాదిరి అలంకరించుకుని. వారిలా ప్రవర్తించాలనే కోరిక కలుగుతుంది. ఇలా హిజ్రాలుగా మారిన వారిని కొంత మంది కనీసం మనుషులుగా కూడా చూడకుండా చీదరించు కుంటున్నారు. ట్రాన్సె జెండర్స్ అనగానే డబ్బులు డిమాండ్ చేస్తూ, కొందరు వివిధ నేరాలకు పాల్పడుతుంటారనే భావనే ఎక్కువ మందిలో ఉంది. కానీ ఎంతో మంది హిజ్రాలు వివిధ రంగాల్లో రాణించి ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్నారు. మరికొందరు ఉన్నత చదువులతో పలు ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా పోలీసు శాఖలోనూ ఉద్యోగాలు పొందిన వాళ్లున్నారు. రాజకీయాల్లోనూ రాణించి ప్రజాప్రతినిధులైన హిజ్రాలు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఎవరూ కూడా ట్రాన్సజెండర్స్న కించపరచకండి.ట్రాంజెడర్స్ ను సొసైటీ గౌరవించాలన్నారు. సమాజంలో వారు కూడా మనలో వారిగా గుర్తించాలన్నారు. విద్యా , వైద్య,అన్నీ రంగాల్లో ప్రోత్సహించాలి అన్నారు. చదువులో వారిని ప్రోత్సహించాలన్నారు. రాజ్యాంగం కుడా వారికీ హక్కులు కాలపించిందన్నారు.
ఈ ప్రోగ్రాం లో ఆసుపత్రి సిబ్బంది బండారు శ్రీనివాస్,రవీందర్ రెడ్డి, ఉదయ్‌కుమార్, ఇబ్రహీం, ట్రాంజర్స్ అధ్యక్షురాలు రమ్యరెడ్డి, పద్మమ్మ, భాగ్యలక్ష్మి, కవిత, కల్పన, పాల్గొన్నారు.రన్నింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ జోయా, సెకండ్ ప్రైజ్ ,లక్కీ గెలుపొందారు.









