*జనం పవర్,జగిత్యాల, సెప్టెంబర్10*
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుధవారం రోజున గోదావరి నది తీరంలో పుష్కర ఘాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ 2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం దేవదాయ శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ దూర దృశ్య మాధ్యమంలో సమావేశం నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం ధర్మపురి పట్టణంలోని గోదావరి నది మరియు ఘాట్లను పరిశీలించారు.
అనంతరం గోదావరి పుష్కరాలకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున సంబంధించిన అధికారులతో సమీక్షించి పుష్కరాల ఏర్పాటుపై చర్చించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి టెంపుల్ ఈవో శ్రీనివాస్, ఎమ్మార్వో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Post Views: 23









