జనం పవర్, గంగాధర – సెప్టెంబర్ 05
ఘనంగా తొమ్మిది రోజులుగా పూజలు, అభిషేకాలు అందుకున్న గణనాధుడు నేడు మహా నిమజ్జనోత్సవంతో ముగింపు పొందాడు. బూరుగుపల్లి శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనం కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఘనంగా ప్రారంభమైంది.
భక్తులు ఉత్సాహంగా గణనాథుని విగ్రహాలను తీసుకువచ్చి మంగళహారతులు ఇచ్చి, శోభాయాత్రగా ఊరేగింపుగా నిమజ్జన స్థలానికి తీసుకెళ్లారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని నినాదాలతో మార్మోగించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి, కార్యక్రమం విజయవంతంగా ముగిసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులు, యువత, పెద్ద సంఖ్యలో మహిళలు కూడా పాల్గొని నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేశారు.
Post Views: 130









