జనం పవర్, రామగుండం, సెప్టెంబర్ 5:
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి, మున్ముందు జ్యూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింగమూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షులు లగిశెట్టి చంద్రమౌళి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు అన్నారు. గోదావరిఖని కల్యాణ్ నగర్లోని శ్రీనిధి టవర్స్ అపార్ట్మెంట్లో శుక్రవారం గణేష్ నవరాత్రుల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి సహకారంతో అపార్ట్మెంట్ లోని కుటుంబాలకు జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేత్ర, అవయవ, శరీర దానాలపై సదాశయ ఫౌండేషన్ చేస్తున్న కృషిని వివరించడంతోపాటు అవయవదనాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అధ్యక్షులు లగిశెట్టి చంద్రమౌళి ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ కమిటి ప్రతినిధులను సత్కరించారు. పిల్లలు, మహిళలు భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ గణనాథుని శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి టవర్స్ గౌరవాధ్యక్షులు విశ్వనాథం, సలహాదారులు విజయ్ కుమార్ గౌడ్, వెంకటేశ్వర్లు అధ్యక్షులు లగిశెట్టి చంద్రమౌళి, కార్యదర్శి రామచంద్రం,
కోశాధికారి నాగరాజు, కమిటీ సభ్యులు,
శ్రీనిధి టవర్స్ వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్, బ్రహ్మచారి, సమ్మయ్య, స్వామి, సత్తయ్య, సురేందర్ తిరుపతి రెడ్డి, కోటేశ్వర్, దేవదర్శన్ రెడ్డి, సత్తయ్య, రామ్మూర్తి, రంగజ్యోతి, స్వరూప, సునీత, సుమతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.









