వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు • మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ అన్వర్

జనం పవర్,కమాన్‌పూర్ సెప్టెంబర్ 5:
కమాన్‌పూర్ మండలంలోని గుండారం గ్రామపంచాయతీ పరిధిలో జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించి,నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు.భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ట్రాఫిక్ నియంత్రణ,పానీయ జలాల సరఫరా,వైద్య శిబిరాలు,భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.ఈ సందర్భంగా సయ్యద్ అన్వర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం పండుగలో ప్రతి ఒక్కరూ శాంతి,సౌభ్రాతృత్వ వాతావరణంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజల ఆనందం కోసం జరిగే ఈ ఉత్సవాలను అందరూ పరస్పరం సహకరించి సాఫీగా ముగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు,ఆకుల ఓదెలు,జూలపల్లి మాజీ సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్,సయ్యద్ ఇక్బాల్,అబ్దుల్ రఫీక్,కిషన్ రెడ్డి,ముస్తాక్,గడప కృష్ణమూర్తి,మల్యాల మహేష్,నాగునూరి నర్సయ్య,అనవేణి లష్మిరాజాం,బోనాల సత్యం,చాట్ల గట్టయ్య,యూసుఫ్ లల్లు,నల్లెలి శంకర్,బొజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :