భక్తిశ్రద్ధలతో బిజిగిర్ షరీఫ్ దర్గా వద్ద మీలాదున్ నబీ పండుగ వేడుకలు

జనం పవర్, జమ్మికుంట, సెప్టెంబర్ 05:

మహ్మద్ ప్రవక్త రబీ ఉల్ అవ్వల్ మాసం 12వ తేదీ క్రీ.శ.571 మక్కాలో జన్మించారు.మీలాద్ అంటే జన్మదినం.నబి అంటే ప్రవక్త.మీలాద్-ఉన్-నబి అంటే ప్రవక్త జన్మదినం.ముస్లీంలు సంప్రాదాయబద్దంగా మిలాదున్ నబిని వేడుకలను బిజిగిర్ షరీఫ్ దర్గా వద్ద శుక్రవారం రోజున జరుపుకున్నారు.ముస్లిం మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు చేసారు.దర్గా భక్తుడు న్యామతుల్లా నిజమీ దర్గా భక్తులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ మానవాళిని వక్రమార్గం నుండి సన్మార్గం వైపు నడిపించడానికి అల్లాహ్ ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో లక్షకు పైగా ప్రవక్తలను అవతరింపచేశాడన్నది ఇమాన్ (విశ్వాసం) గల ప్రతి ముసల్మాన్ విశ్వాసం.కాని ప్రళయాంతం వరకు మానవాళికి సన్మార్గం చూపడానికి అల్లాహ్ అనుజ్ఞను శిరసావహించి విధేయులుగా జీవించే మార్గాన్ని భోదించడానికి అల్లాహ్ పంపిన అంతిమ ప్రవక్త మహ్మద్ ప్రవక్త(సల్లల్లాహ్ అలైహివసల్లం)ఇస్లాం బోధనలు ఆచరణీయం,సర్వదా ఆమోదయోగ్యం,మానవాళి మనుగడకు మహోన్నత జీవనవిధానం బోధించిన మహ్మద్ ప్రవక్త(సల్లల్లాహ్ అలైహివసల్లం) జన్మదిన వేడుకలే మిలాదున్ నబి సంబరాలు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్,దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం,దర్గా కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌపిక్ హుస్సేన్,దర్గా కమిటీ కార్యదర్శి మొహమ్మద్ జమాల్ అష్రఫ్,దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ నయిముద్దీన్,సభ్యులు అబ్బాస్,సర్వర్,తాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :