విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం • ఎమ్మెల్యే విజయరమణా రావు

జనం పవర్,పెద్దపల్లి సెప్టెంబర్ 5:
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమర్‌నగర్ చౌరస్తాలో స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం సిరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి రెసిడెన్షియల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గొప్పతనాన్ని స్మరించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి,ఉపాధ్యాయుల సంక్షేమానికి చేపడుతున్న పథకాలను వివరించారు.ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణానికి పునాది వంటిదని,విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు.అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యే విజయరమణా రావును ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన పెద్దపల్లిలోని 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ప్రత్యేకంగా సత్కరించారు.ఈ సమావేశానికి డీసీఈబీ సెక్రటరీ వాలుక హనుమంతు,మండల విద్యాధికారి సురేందర్ కుమార్,గవర్నమెంట్ ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమిషనర్ రాంరెడ్డి,సీనియర్ హెడ్ మాస్టర్ చాట్ల ఆగయ్య,అసోసియేషన్ అధ్యక్షులు సాదుల వెంకటేశ్వర్లు,ఇతర నాయకులు,ఉపాధ్యాయులు,మాజీ కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :