*మెడికల్ సూపరింటెండెంట్ ను ప్రశ్నించిన శ్యానిటేషన్ సిబ్బంది*
*జీతాలు అందక హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు సమ్మె*
*స్పందించని మెడికల్ సూపరింటెండెంట్*
*జనం పవర్, హుజూరాబాద్ , సెప్టెంబర్ 05*
తమకు ఆరు నెలలుగా జీతాలు అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడి విధిలేని పరిస్థితుల్లో హుజురాబాద్ సివిల్ హాస్పిటల్ లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఆస్పత్రి ముందు సమ్మెకు దిగారు. గత ఆరు నెలల నుండి తమకు జీతాలు ఇవ్వట్లేదని వర్కర్స్ ఆందోళన చేపట్టారు. ఆరు నెలల నుండి జీతాలు ఇవ్వకుంటే మేము ఏం తినాలి ఎలా బ్రతకాలి అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 5వ తేదీ లోపు జీతాలు ఇవ్వకుంటే సి.ఐ.టియు ఆధ్వర్యంలో సమ్మె చేపడతామని అని శుక్రవారం రోజు వెంటనే జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ఆన్లైన్ ద్వారా మెడికల్ సూపరింటెండెంట్ ఖాతాలో తమ జీతాలు జమైన సమాచారం ఉన్నదని అయిన తమ జీతాలు అధికారులు ఎందుకు విడుదల చేయడం లేదని వారు ప్రశ్నించారు.చాలి, చాలని జీతాలతో తాము ఉద్యోగాలు చేస్తున్నామని అయిన కూడా విడుదలైన తమ జీతాలు తమ ఖాతాల్లో ఎందుకు జమ చేయకుండా ఆలస్యం చేస్తున్నారని వారు అధికారులను ప్రశ్నించిన తమకు సమాధానం చెప్పే నాదుడు కరువయ్యారని వారు విమర్శించారు.తమ జీతాలను విడుదల చేయకుంటే సమ్మె ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.









