జనం, పవర్, సిద్దిపేట సెప్టెంబర్:05
*శాంతియుత ప్రశాంతమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా వినాయక శోభయాత్ర నిర్వహించుకోవాలి*
రాజగోపాల్ పేట ఎస్సై టి. వివేక్
పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ ఆదేశానుసారంగా నంగునూర్ మండలం లో సెప్టెంబర్ 05, 06 వ తేదీ శుక్రవారం, శనివారం, నాడు జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్బంగా జరిగే శోభయాత్ర రూట్ లు మరియు నిమర్జనం సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తుతోపాటు, పోలీసుపరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని జరిగిందని రాజగోపాల్ పేట టి.ఎస్సై వివేక్ పేర్కొన్నారు. వినాయక శోభయాత్రలో డీజేల వినియోగంతోపాటు బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించామన్నారు. అదేవిధంగా నిమజ్జనం కొరకు నిర్వహించే శోభాయాత్రలో పాల్గొనే భక్తులు దేవునిపై భక్తి శ్రద్ధలు భజన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు.
నంగునూర్ మండల ప్రజలు ప్రజాప్రతినిధులు యువకులు వినాయక శోభాయాత్రను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్నందున చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్వేషపూరిత నినాదాలు, ప్రసంగాలు చేయడం లేదా పాటల వినియోగం వంటి చర్యలకు పాల్పడరాదని తెలిపారు. ఇట్టి నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా భక్తి శ్రద్దలతో, మతసామారస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో నిమ్మజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు.









