–విరిగిన ఆట వస్తువులు,
–పనిచేయని పరికరాలు
–పట్టించుకోని మున్సిపల్ అధికారులు
జనం పవర్, వనపర్తి, సెస్టెంబర్ 5 :
వనపర్తి జిల్లా కేంద్రంలోని బండారు నగర్ 24 వార్డులోని ప్రజా కవి కాళోజీ పార్క్ అధ్వానంగా తయారు అయింది అని 24వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వజ్రాల రమేష్ ఆరోపించారు. శుక్రవారం ప్రజా కవి కాళోజీ పార్క్ ను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సేవ కేంద్రంలో 30-03-2018 కల్వకుంట్ల తారకరామారావు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్ మెంట్, సమాచార సాంకేతిక (ఐ.టి.), టెక్స్టైల్స్, గనులు, ఎన్నారై అఫైర్స్ శాఖ మంత్రి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ప్రారంభించారు. గతంలో బాగానే ఉన్నా నేడు నిర్వహణ లేక అధ్వానంగా తయారై పార్కులో ఏర్పాటు చేసిన ఆట వస్తువులు ఎక్కడికక్కడ విరిగిపోవడంతో చిన్నారులు ఆటలకు దూరం అవుతున్నారు. విరిగిన జారుడు బండలు, ఊయ్యాలలు, పార్కు చెత్తతో దర్శనమిస్తున్నది. అందులోని కొన్ని పరికరాలు వాడకంలో లేకుండా పోయాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన చిన్నపిల్లల పార్కు సంరక్షణ బాధ్యతను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ మున్సిపల్ అధికారుల సమస్యను పరిష్కరించాలని వజ్రాల రమేష్ కోరారు.










