జనం పవర్ వార్తా: (ప్రతినిధి అలువాలా రాజేందర్:
పెద్దపెల్లి జిల్లా:
పెద్దపల్లి : సెప్టెంబర్ 5: గోపయ్య పల్లి గ్రామానికి చెందిన దుర్గం మహేందర్ అనే ప్లంబర్ కార్మికుడు ప్లంబింగ్ పని చేస్తూ కట్టర్ వల్ల అతని ఎడమ పాదం తెగిపోయి మరియు లోపల నరాలు కూడా తెగి మొత్తం పాదం నుజ్జు నుజ్జు అవడం జరిగింది. వెంటనే అతనిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి గాయం చాలా జటిలము మరియు శస్త్ర చికిత్స చేయడం కూడా చాలా రిస్క్ తో కూడుకున్నది. అయినప్పటికి ఎముకల వైద్య నిపుణులు అయినా డా. కె. శ్రీనివాస్ రెడ్డి గారు త్వరగా స్పందించి ఆ పేషెంట్ కు తెగిన నరాలను అతికించి, విరిగిన ఎముకలను కూడా అతికించడం జరిగింది. ఇలాంటి అరుదైన మరియు కష్టమైన ఆపరేషను మన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం జరిగింది. కావున పెద్దపల్లి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలోని సేవలను వినియోగించుకోవాలి అని అస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ తెలిపారు అలాగే అరుదైన శస్త్ర చికిత్స చేసిన డా. కె. శ్రీనివాస్ రెడ్డి మరియు డా. కృష్ణ వేణిల వైద్య బృందాన్ని అభినందించడము జరిగింది. అలాగే ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ Ch. విజయరమణ రావుగారు కూడా వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని తెలిపారు.










