హుజురాబాద్‌లో కోతుల బీభత్సం* *-ప్రజల్లో తీవ్ర భయం – అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం*

*హుజురాబాద్‌లో కోతుల బీభత్సం*

*-ప్రజల్లో తీవ్ర భయం – అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం*

*జనం పవర్,హుజురాబాద్ సెప్టెంబర్ 05*

హుజురాబాద్ పట్టణంలోని పోచమ్మవాడ లో కోతుల బీభత్సం మళ్లీ ప్రదర్శన ఇచ్చింది. తాళ్లపల్లి సారయ్య అనే వ్యక్తిపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది.గతంలో కూడా ఇలాంటి దాడులు అనేకసార్లు జరిగి పలువురు గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.అయినప్పటికీ అధికార యంత్రాంగం ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది.ప్రతి రోజు కోతుల భయం మధ్యనే జీవించాల్సి వస్తోంది. పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు అని స్థానికులు వేదన వ్యక్తం చేస్తున్నారు.కోతుల బీభత్సాన్ని అరికట్టే చర్యలు వెంటనే తీసుకోవాలని హుజురాబాద్ ప్రజలు గళమెత్తుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :