ఎట్టకేలకు కెమెరా ముందుకు ట్రంప్‌

• చనిపోయారన్న వదంతులకు తెర
• గోల్ఫ్ ఫోటోలు విడుదల చేసిన వైట్‌హౌస్

జనం పవర్, హైదరాబాద్, ఆగస్టు 31:

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరణించారంటూ, కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగింది. ఈ రూమర్స్ అంతగా హద్దులు దాటడంతో “ట్రంప్ డెడ్‌( #TrumpIsDead)” అనేది ట్విట్టర్ లో ట్రెండింగ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ వదంతులకు చివరకు వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ట్రంప్ వర్జీనియాలోని తన గోల్ఫ్ కబ్‌ల‌లో మనుమరాలు కయి ట్రంప్, మనవడు ఫ్రెడరిక్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలను వైట్‌హౌస్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ ఫోటోలతో ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. తెల్లటి పోలో షర్ట్, ఎరుపు రంగు క్యాప్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ట్రంప్ హుషారుగా గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఫోటోలపై టైమ్ స్టాంప్ కూడా ఉండటంతో అవి తాజాగా తీసినవేనని నిర్ధారితమైంది.

ట్రంప్ ఫోటోలు బయటకు రావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. “ట్రంప్ సేఫ్” అంటూ సోషల్ మీడియాలో రిప్లైలు వెల్లువెత్తాయి. గత కొన్ని రోజులుగా ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన మృతిచెందారని వచ్చిన ప్రచారాలు పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది. ట్రంప్ విషయంలో బయటపడిన ఈ అపోహలు మరోసారి సోషల్ మీడియా వదంతుల తాలూకు ప్రమాదాలను వెలుగులోకి తెచ్చాయి. నిర్ధారణలేని సమాచారం ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో, అది అంతర్జాతీయ స్థాయిలో ఏ రీతిగా ప్రభావం చూపుతుందో ఈ ఘటనతో స్పష్టమైంది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :