జనం పవర్, హైదరాబాద్:
ఉగ్రవాదం, ప్రాంతీయ సంఘర్షణలు, వాణిజ్య యుద్ధాలతో నిండిపోయిన ప్రస్తుత కాలంలో విదేశీ సరఫరాలపై భారత రక్షణ రంగం ఆధారపడటం మంచిది కాదని, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడటంలో సైనిక స్వావలంబన అత్యంత కీలకమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన దిల్లీలో ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన రక్షణ సదస్సులో ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన, ప్రతిపాదిత సుదర్శన చక్ర గగనతల రక్షణ వ్యవస్థను రానున్న 10 ఏళ్లలో పూర్తిగా అభివృద్ధి చేసి, దేశంలోని కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శక్తిమంతమైన స్వదేశీ జెట్ ఇంజిన్లను అభివృద్ధి చేయడం అనే సవాలును భారత్ స్వీకరించిందని, ఈ కీలకమైన ప్రాజెక్టుకు సన్నాహాలు పూర్తయ్యాయని, అతి త్వరలోనే దీని ఫలితాలు nation’s defense సిస్టమ్‌లో కనిపిస్తాయన్నారు.
“భారత్ ఎవరితో శత్రుత్వం కోరుకోదు. కానీ తన ప్రయోజనాల విషయంలో రాజీపడదు. దేశ ప్రజలు, రైతులు, చిరువ్యాపారుల సంక్షేమమే మాకు ప్రాధాన్యం. భారత్‌ను ఎంత ఒత్తిడికి గురిచేస్తే, అంత ఎత్తుకు ఎదుగుతుంది” అంటూ ఆయన అమెరికా విధిస్తున్న వాణిజ్య సుంకాల సందర్భంలో స్పందించారు.
ఆ అనంతరం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చేరుకొని రఫే ఎంఫిబీర్ ప్రైవేట్ లిమిటెడ్ రక్షణ పరికరాల పరిశ్రమ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు కీలక వ్యూహంగా మారాయి, ఇవి యుద్ధంలో భాగంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు.









