జనం పవర్,పెద్దపల్లి ఆగస్టు 31:
పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న టాస్క్ రీజనల్ సెంటర్ ద్వారా పలు టెక్నికల్ కోర్సులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు సెంటర్ ఇన్‌చార్జి టి.కౌసల్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జావా వెబ్ డెవలప్‌మెంట్, పైథాన్, సి,సి++,హెచ్‌టీఎమ్‌ఎల్,సిఎస్‌ఎస్,జావాస్క్రిప్ట్,టాలీ విత్ జిఎస్టీతో పాటు ఆప్టిట్యూడ్,రీజనింగ్,సాఫ్ట్ స్కిల్స్ వంటి అంశాల్లో శిక్షణను అందజేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.జిల్లాలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు సెప్టెంబర్ 2లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని,టాస్క్ శిక్షణ పొందిన అభ్యర్థులకు మంచి ప్యాకేజీలతో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,మరిన్ని వివరాలకు 9059506807 నంబర్‌ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు.
Post Views: 61









