*మేకల మందపై కుక్కల దాడి* *సిరికొండలో 13 మేకలు మృతి* *బాధితుడికి మంత్రి లక్ష్మణ్ కుమార్ భరోసా* *₹ 10 వేల సాయమందించిన వేముల సుభాష్*

 

*జనం పవర్.జగిత్యాల ప్రతినిధి*ఆగష్టు 31*

జగిత్యాల జిల్లాలో కుక్కలు రెచ్చిపోతున్నాయి.
చిన్న పిల్లలను కరువడం, మేకల మందపై దాడి చేయడం వంటి సంఘటనలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పల్లె, పట్టణం, తండా
ఎక్కడ చుసిన కుక్కల మందలు కనపడుతున్నాయి. కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకి చనిపోయే ప్రమాదం ఉండడంతో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులున్నాయి. కుక్కల బాధనుండి రక్షించాలని ప్రజలు వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని బీర్ పూర్ మండల కేంద్రానికి చెందిన ఇంధ్రాల రక్షిత్ (4) బాలుడు కుక్క కాటుతో రేబిస్ వ్యాధి సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన హృదయ విధారక సంఘటన మరువక ముందే శనివారం రాత్రి సిరికొండలో నక్క కొమురయ్యకు చెందిన 13 మేకలు కుక్కల దాడిలో మృతి చెందాయి. బుగ్గారం మండలం సిరికొండలో నక్క కొమురయ్య మేకలు మేపుకుని ఎప్పటిలాగే తన దొడ్డిలో తోలాడు. అయితే రాత్రి మేకల మందపై ఒక్కసారి కుక్కలు దాడి చేయడంతో 13 మేకలు దొడ్డిలోనే అక్కడిక్కడే మృతి చెందడంతో భాధితుడు కొమురయ్య కన్నీటి పర్యన్తమయ్యాడు. ఇట్టి విషయాన్ని బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ కు స్థానికులు తెలియజేయడంతో ఆదివారం సిరికొండలోని సంఘటన స్థలానికి వెళ్లి కొమురయ్యను ఓదార్చారు. తక్షణ సహాయంగా భాధితుడికి ₹10 వేలు ఆర్థిక సాయం అందించిన వేముల సుభాష్ ఈ సంఘటనను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి ఫోన్ ద్వారా తీసుకెళ్లారు. ఆదివారం అసెంబ్లీ సమావేశం హడావిడి ఉన్నప్పటికీ సుభాష్ ఫోన్ కు స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి కొమురయ్యకు ఆర్థిక సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. వేముల సుభాష్ తో పాటు నాయకులు సత్యనారాయణ రావు, నర్సాగౌడ్, తదితరులు కొమురయ్యను పరామర్శించి దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :