*పంట నష్టమైన రైతులకు ప్రభుత్వమే ఆదుకోవాలి.. ఎమ్మెల్యే రామారావు పటేల్..* *- శాసనసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే..*

 

*జనం పవర్,బైంసా,ఆగస్టు 31:*

రైతుల సంక్షేమంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరదతో నష్టపోయిన రైతంగన్ని ఆదుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం శాసనసభ ప్రాంగణంలో బిజెపి ఎమ్మెల్యే తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో ప్రజలంతా కష్టాల్లో ఉంటే శాసనసభలు నష్టం పై చర్చించకుండా ఇతర బిల్లులపై చర్చించడం ఏమిటని ప్రశ్నించారు. ముధోల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడు లేని విధంగా భారీ వరద వచ్చిందని, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం గోదావరి నది ఉగ్రరూపంతో నిండా మునిగిందన్నారు. నియోజకవర్గంలో 16 గ్రామాలకు పైగా నది పరివాహక ప్రాంతాలేనని రైతన్ననికి ఎన్నడూ లేనంత నష్టం జరిగిందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిందని, రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించి, రైతులకు నష్టపరిహారం ఇచ్చే విషయమై ప్రకటించవలసిందిగా కోరారు. రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :