జనం పవర్, జన్నారం, ఆగస్ట్ 31:
జన్నారం మండల కేంద్రంలో ఆదివారం అఖిలభారత బిసి సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం తరఫున హైదరాబాద్ రవీంద్ర భారతిలో యుద్ధభేరి కార్యక్రమం సందర్భంగా జన్నారం మండల బీ సి సంఘం తరపున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కులాల వారికి స్థానిక సంస్థలు 42 శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగాల్లో ప్రమోషన్లలో చట్టసభల్లో 50 శాతం 9వ షెడ్యూల్ లో చేర్చడం ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని. వినాతి పత్రం ద్వారా జన్నారం మండలం బీ సి సంఘం అధ్యక్షుడు గూడా అశోక్. కోరారు. ఈ కార్యక్రమంలో బీ. సి. కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కార్ల నరసయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడెపు లక్ష్మీనారాయణ, జన్నారం మండల బిసి సంఘం ప్రధాన కార్యదర్శి సంద గోపాల్, బాదంపల్లి ఎంపీటీసీ కాసెట్టి రాజన్న, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్రపు పురుషోత్తం, పొనకల్ మాజీ ఎంపీటీసీ రాగుల శంకర్, జిల్లాల మండల పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న, సామాజికవేత్త శ్రీరాముల భూమా చారి, బీసీ సంఘం నాయకుడు మామిడి విజయ్. ఎం సత్యం, టూ వీలర్స్ మెకానిక్ సంఘం అధ్యక్షుడు బాలిన మధు, ఎం శ్రీనివాస్, గూడెల్లి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.









