జనం పవర్,రామగిరి ఆగస్టు 20:
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పరిధి మేడిపల్లి శివారులో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూముల స్వాధీనానికి రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ప్రతిపాదన మేరకు 2003 ఎకరాల భూములు అవసరం కాగా, అందులో 145 ఎకరాలు రత్నాపూర్‌కు చెందిన 120 మంది రైతుల భూములుగా గుర్తించారు. ఈనెల 1న అధికారులు గ్రామంలో అభిప్రాయ సేకరణ చేపట్టగా, రైతులు తమ పంట భూములను వదులుకోవడానికి నిరాకరించారు. దీనితో కలెక్టర్ ఆదేశాలపై రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహాయంతో బుధవారం రైతుల ఇళ్లకు నోటీసులు అంటించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం స్వాధీనం ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, జీవనాధారమైన పంటలను కోల్పోతే ఎలా బతుకుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, బలవంతంగా భూములు గుంజుకుంటే తీవ్ర నిరసనకు దిగుతామని హెచ్చరించారు.
Post Views: 89









