జనం పవర్,రామగుండం ఆగస్టు 20:
కోల్ ఇండియా, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంపు కోసం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు వినతి పత్రం సమర్పించారు. సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏఐటీయూసీ నేతలతో కలిసి రిటైర్డ్ బొగ్గు కార్మికులు 1998లో ప్రవేశపెట్టిన కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ ప్రకారం కనీసం రూ.1000 మాత్రమే పెన్షన్ అందిస్తున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. 27 సంవత్సరాల కరువు భత్యం చెల్లించకపోవడం బాధాకరమని, కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరిస్తూ రిటైర్డ్ పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవితం కల్పించాల్సిన అవసరం ఉందని కోరారు.
Post Views: 117









