జనం పవర్,రామగుండం ఆగస్టు 20:
రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కు కృతజ్ఞత సభ స్థానిక గంగానగర్‌లోని సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ యాజమాన్యానికి యూరియా లోడింగ్‌లో 30 శాతం రామగుండం ఏరియా లారీ యజమానుల సంఘానికి కేటాయించాలని డిమాండ్ చేసినందుకు స్పందించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోడింగ్ లభిస్తే సుమారు 6000 కుటుంబాలు లబ్ధిపొందుతాయని సంఘం అధ్యక్షుడు కందురు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత పదిేళ్లలో లారీ కుటుంబాలు ఇబ్బందులు పడినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ తమకు చేదోడువాదోడుగా నిలిచి బొగ్గు, ధాన్యం, యూరియా లోడింగ్‌లో వాటా రావడానికి కృషి చేశారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో యం.డి.ఖాజా మొహినొద్దీన్, తంగెళ్ల పాండురంగారావు, గండ్ర రఘుపతి రావు, కర్రి తరుణ్ కుమార్, యం.డి.అర్షద్, వైద్య శ్రీనివాస్, యం.డి.సలీం పాషా, యన్న రాంరెడ్డి, గుడికందుల లచ్చయ్య, యం.డి.రాజ్ మహ్మద్, సయ్యద్ కరీం, గండ్ర ఆనంద రావు, మాదారపు హరీష్ రావు, పొన్నం శ్యామ్ సుందర్ గౌడ్, చల్లా రాజిరెడ్డి, బొద్దుల శ్రీనివాస్, యం.డి.కరీం, యం.డి.మోహిత్ ఖాన్, మేడి శ్రీనివాస్, చెల్పూరి సతీష్, మేకల రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.









