జనం పవర్.జగిత్యాల.ఆగష్టు 20
నిరుద్యోగుల పాలిట పాపపు ప్రభుత్వంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర పూటల్లో నిలవాబోతుందని మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వసంత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అబద్దపు హామీలు, అసత్య ప్రచారాలతో తెలంగాణ సమాజాన్ని భ్రమాల్లోకి నెట్టి, అధికారంలోకి వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా వంచిస్తూ నిరుద్యోగులను నిండా ముంచడంతో పాటు, తెలంగాణ సమాజాన్ని నిండా ముంచిందన్నారు. 60 వేల ఉద్యోగాలు ప్రకటించామని చెప్తున్న ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్, పరీక్షల, ఫలితాల వివరాలపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలని అన్నారు. జాబ్ ఆర్డర్ కాపీలు పంచి తామే భర్తీ చేశామని ప్రకటించుకోవడం సిగ్గు చేటన్నారు. జాబ్ క్యాలెండర్ ఆచూకీ లేదని, తేదీలు, నెలలు మారుతూ 20 నెలల్లు పూర్తయినా నేటికీ జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యకపోవడం విడ్డూరమన్నారు. తల్లితండ్రుల గుండెలపై కుంపటి లాగా నిరుద్యోగుల జీవితాలు మారాయని ప్రతిపక్షంలొ ఉన్నపుడు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక ఆ కుంపటి దించే ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదో నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చేందుకు నిరుద్యోగులను, విద్యార్థులను రెచ్చగొట్టారని, నేడు ఆ విద్యార్థులు, నిరుద్యోగ యువకులే ప్రభుత్వానికి కంటిలో నలుసుల మారిన విషయం ప్రభుత్వం గుర్తించాలన్నారు. విమర్శలు తేలికే కానీ ఆచరణ కష్టం అని తెలుసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యిందని విమర్శించారు. విద్యాశాఖ దుస్థితి అద్వానంగా మారిందని, కనీసం 20 నెలాల కాలంలో విద్యాశాఖ పై సమీక్ష చెయ్యకపోవడం విద్యా శాఖపై ప్రభుత్వము చిత్తశుద్ధికి నిదర్శనంగా భావించక తప్పదన్నారు. మన ఊరు మన బడి పనులు చేసిన కాంట్రాక్టర్ లు బిల్లులు అందక రెండు సార్లు డిప్యుటీ సీఎం చాంబార్ ఎదుట ధర్నా, నిరసన తెలపడం ప్రభుత్వం అసమర్ధతకు నిదర్శనం అన్నారు. గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు ఫుడ్ పాయిజాన్, పాము కాటుల వాళ్ళ మృతి చెందారని, హాస్టల్ లు డెత్ స్పాట్ లను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పుకునే 60 వేల ఉద్యోగాల్లో కానిస్టేబుల్ కొలువు ఒక్కటి కూడ లేదని, 20 నెలలల కాలంలో గ్రూప్ 3, గ్రూప్-4 లాంటి పోస్ట్ లకు మోక్షం లభించడం లేదన్నారు. 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, 420 హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగుల కృషితో గద్దెనెక్కిన ప్రభుత్వం నేడు అదే నిరుద్యోగులను విస్మరించడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. తక్షమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా నిలవాలని వసంత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు. ప్యాక్స్ ఛైర్మెన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు జక్కుల తిరుపతి. బుర్ర ప్రవీణ్ గౌడ్. నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.









