జనం పవర్,బెల్లంపల్లి:ఆగస్టు,16:
సింగరేణి క్వాటర్లు శిధిలావస్థలో ఉన్నాయని, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు క్వార్టర్లు ఉరుస్తున్నాయని, కూలే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా సింగరేణి అధికారులు నిర్లక్ష్యం వీడాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసం ఉంటున్న ఏ3 క్వార్టర్లో శ్లాబ్ కూలింది. అయితే, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లడం వలన పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, తాను రెండు రోజుల నుంచి ఇక్కడ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
తను వుంటున్న క్వార్టర్‌ను రిపేర్ చేయాలని ఎన్నోమార్లు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని, మందమర్రి జీఎంను స్వయంగా కలిసి చెప్పడం జరిగిందని ఉన్నారు. అక్కడే నివాసం ఉంటున్నామని చెప్పినా నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లుగా సింగరేణి క్వార్టర్‌కు అద్దె కడుతున్నామని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కార్మికులు,అధికారులు,అద్దె కడుతూ నివాసం ఉంటున్న నాయకుల క్వార్టర్లను మరమ్మతులు చేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధికారులను కోరారు.









