తెలంగాణా స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్‌లో మెరిసిన దోమకొండ సిద్దివర్ధన్

జనం పవర్, గంగాధర ఆగస్ట్ 16:

గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయానికి చెందిన విద్యార్థి దోమకొండ సిద్దివర్ధన్ (ఉప్పరమల్యాల గ్రామం, తండ్రి గంగాప్రశాంత్) ప్రతిభతో క్రీడా రంగంలో కీర్తి సాధించాడు. ఇటీవల జూలైలో జరిగిన తెలంగాణా స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికల్లో అతడు ఆదిలాబాద్‌ స్పోర్ట్స్‌ పాఠశాలలో సీటు సంపాదించాడు. ఈ విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం పాఠశాల యాజమాన్యం అతనిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాల విద్యతో పాటు క్రీడలపైనా సమానమైన శ్రద్ధ చూపాలని సూచించారు. స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశం పొందడం ద్వారా క్రీడాకారులకు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగావకాశాలు సులభంగా లభిస్తాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ అనంతరెడ్డి, ప్రధానోపాధ్యాయులు నర్సింగరావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :