న్యూజిలాండ్ లో భారతీయ సంప్రదాయ కళా వేడుకలు

 

జనం పవర్, వనపర్తి, ఆగష్టు 16:

న్యూజిలాండ్ లో నిర్వహించిన భారతీయ సంప్రదాయ కళా వేడుకల్లో పాల్గొన్న న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఈయన ఆగస్టు 16వ తేదీన డ్యూ డ్రాప్ ఈవెంట్ స్టేడియంలో జరిగిన తెలంగాణ డప్పు ప్రదర్శనను తిలకించి ప్రదర్శన అనంతరం కళాకారులతో ఫోటోలు దిగారు. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లాక్సన్ డప్పు కళాకారుల నృత్యానికి తను కూడా కళాకారులతో కలిసి నృత్యం చేశారు.ఈ డప్పు నృత్యాన్ని డాక్టర్ డప్పు స్వామి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందె భాస్కర్ ఒగ్గు కళాకారుల రవికుమార్ అశోక్ పేరిణి కళాకారులు రాజ్ కుమార్ సంతోష్ ప్రదర్శనను చూసి, సంతోషాన్ని వ్యక్తం చేశారు.మళ్లీ మిమ్మల్ని పిలిపిస్తా అని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన న్యూజిలాండ్ ఇండియా కాన్సులేట్ జనరల్ డాక్టర్ మదన్మోహన్ శెట్టి, సిడిఎస్ ఫౌండేషన్ చారుదాస్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, న్యూజిలాండ్ సెంట్రల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ రావు, తెలంగాణ కళారూపాలను ఇక్కడ వినిపించే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, డాక్టర్ మామిడి హరికృష్ణ కి కృతజ్ఞతలు, ఓ పల్లెలో కొట్టిన కళారూపాలకు అంతర్జాతీయ వేదిక మీద అవకాశం కల్పించిన నిర్వాహకులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :