శభాష్ మున్సిపాలిటీ కార్మిక

 

జనం పవర్ మంచిర్యాల ఆగస్ట్ 16

ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో చోటు చేసుకుంది శనివారం ఉదయం ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షం, బయటికి వెళ్లే ధైర్యం చేయలేక అందరు ఇండ్లకే అతుక్కుపోయిన వైనం. ఇంత వర్షం లో కూడా ఒక కూత వినిపించింది, చెత్త బండి వచ్చిందమ్మా చెత్త ను బండిలో వెయ్యండమ్మా అంటూ ప్రతి గడపను తట్టకుంటూ వర్షం లో తడుస్తూ కూడా తన ఆరోగ్యాన్ని లెక్క చేయక పరిసరాల శుభ్రతే నా బాధ్యత నా కర్తవ్యం అని తను శనివారం నిర్వహించిన బాధ్యతకి కాలనీవాసులు అందరు ఫిదా అయ్యారు.అందరు తమ కర్తవ్య పాలన ఇలా చేస్తే రాబోయ్ రోజుల్లో వికసిత భారత్ ని చూడొచ్చు అని ఈ సంఘటన చూసిన పలువురు ఆ మున్సిపల్ కార్మికుని ప్రశంసించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :