జనం పవర్, వరంగల్ ఆగస్టు 16:
రామన్నపేట, కరీమాబాద్ ఏరియా సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు శనివారం ఉదయం ఉరుసు గుట్ట వద్ద సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా పార్టీ ఏరియా కార్యదర్శి సింగారపు బాబు వహించగా ఉదయం పూట సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ టి ఉప్పలయ్య శాస్త్రీయ ఆలోచన అనే అంశం పైన క్లాసును బోధించడం జరిగింది. సమాజం భావవాదం భౌతిక వాదం అనే అంశాల మీద నడుస్తుందని భౌతిక వాదం వాస్తవ పరిశీలనల మీద శాస్త్రీయ ఆలోచనలతోటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటుందని తెలిపారు. భావవాదం నమ్మకాల పేరుతోటి, విశ్వాసాల పేరుతోటి ఉంటుందని ఇది మూఢనమ్మకాలను పెంపొందిస్తుందని సమాజ అభివృద్ధికి ఆటంకంగా ఉంటుందని అన్నారు. మానవ అభివృద్ధి, సమాజ పరిణామ క్రమం ఇప్పటివరకు భౌతిక వాదం మూలంగానే అభివృద్ధి అయిందని అన్నారు. భావవాదులు మతాలు, ఆచారాల పేరుతోటి ప్రజలను విడదీస్తూ దేవుడి పేరు చెప్పి తమ కాలాన్ని వెళ్లబుచ్చుతారని అన్నారు. సమాజంలో మూఢనమ్మకాలను వెనక్కు నెట్టి శాస్త్రీయ ఆలోచనలతోనే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. మధ్యాహ్నం పూట దోపిడీ పద్ధతులు అనే అంశం మీద సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్. గడ్డం రమేష్ క్లాస్ బోధించారు. సమాజంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా శ్రమ మూలంగానే జరిగిందని అన్నారు. ఈ శ్రమ శారీరక మానసిక శ్రమలుగా ఉంటుందని తెలిపారు. శ్రమతోటే విద్య , వైద్యం, సంపద, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినాయని తెలిపారు. కానీ మానవశ్రమతోటి అభివృద్ధి చెందిన సంపద ఇప్పుడు కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడి ఉంది అని ఒక్క శాతం కార్పొరేట్ శక్తుల వద్ద 40 శాతం సంపద కేంద్రీకరించబడి ఉందని, ఇది అందరము అర్థం చేసుకొని చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. సంపద ప్రజలందరికీ సమాన పంపిణీ అయ్యే విధంగా సమాజంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. దోపిడీని అంతం చేస్తేనే అది సాధ్యమవుతుందని దోపిడీ సమాజాన్ని కూలదోసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించగలగే సమాజాన్ని సృష్టించుకోవాలని అందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ శిక్షణ తరగతులకు 70 మంది హాజరవ్వగా నాయకులు ఆరూరి కుమార్, ఏరియా నాయకులు గున్నాల ప్రభాకర్, అప్పాజీ వాణి, రెడ్డి, చీర కవిత, దివ్య, ఆలం, సింగారపు కృష్ణ తదితరులు హాజరు కావడం జరిగింది.









