జనం పవర్ సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, ఆగస్టు 16:
ఇండియన్ ఆర్మీలో అహిర్ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహసభ డిమాండ్ చెస్తుంది. 1962 నవంబర్ 18న చైనాతో జరిగిన యుద్ధంలో 114 మంది యాదవ సైనికులు అమరులయ్యారని వారి త్యాగాలకు సరైన గుర్తింపు లభించలేదని నంగునూరు మండల యాదవ సంఘం అధ్యక్షులు వడితం కిరణ్ కుమార్ యాదవ్ అన్నారు.రేజంగ్ల రాజ్ కళాశాయాత్ర 1962 భారత్ చైనా యుద్ధంలో వీరమరణం పొందిన 114 మంది యాదవ శౌర్య యోధులను స్మరించుకుంటూ అఖిల భారత యాదవ మహసభ నంగునూరు మండల యాదవ సంఘం ఆద్వర్యంలో యాదవ కుల భాందవులందరం కలిసి స్వాగతం పలుకడం జరిగింది వారు మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేజంగ్ల రాజ్ కళాశాయాత్ర 2025 ఏప్రిల్ 13న బీహార్ రాష్ట్రంలోని చాప్రా జిల్లా నుండి ప్రారంభమైంది ఈ యాత్ర 1962 భారత్ చైనా యుద్ధంలో వీరమరణం పొందిన 114 మంది యాదవ శౌర్య యోధులను స్మరించడమే ప్రధాన ఉద్దేశం గా కొనసాగుతుంది బీహార్ నుండి ప్రారంభమైన యాత్ర ఝార్ఖండ్ పశ్చిమబెంగాల్ ఛత్తీస్గడ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ పుదుచ్చేరి కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్ హర్యానా రాష్ట్రాలలో కొనసాగుతుంది ఈ కళాశాయాత్ర నవంబర్ 18 వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మూయనుంది అక్కడ దేశం నలుమూలల నుండి వచ్చిన నాయకులతో కలిసి అహిర్ యాదవ రెజిమెంట్ పున స్థాపన కోసం డిమాండ్ చేయబడుతుంది యాత్ర దేశభక్తి శౌర్య గాతల అభివృద్ధి యాదవుల మలుపు తిరిగిన చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లే మహత్తర కృషిగా నిలుస్తుంది. అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నంగునూరు మండల యాదవ సంఘం అధ్యక్షులు వడితం కిరణ్ కుమార్ యాదవ్ గుండెలి రాజయ్య యాదవ్ వర్దోల్ వేణుచక్రవర్తి యాదవ్ ఎల్పుల ఐలయ్య యాదవ్ బొల్లు తిరుపతి యాదవ్ చెలికాని మల్లేశం యాదవ్ పరశురాములు యాదవ్ ఆంజనేయులు యాదవ్ మల్లేశం యాదవ్ వెంకటేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ వివిధ గ్రామాల యాదవ కుల భాందవులు తదితులున్నారు









