ఏకగ్రీవంగా ఎన్నికైన కమాన్‌పూర్ రజక సంఘం కమిటీ

జనం పవర్, కమాన్‌పూర్‌ ఆగస్ట్ 16:
కమాన్‌పూర్ మండల కేంద్రంలోని రజక సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా జంగపల్లి కనుకయ్య, అధ్యక్షుడిగా జంగపల్లి వెంకటేశం, ఉపాధ్యక్షుడిగా జంగపల్లి ఎల్లయ్య, కోశాధికారిగా జంగపల్లి రవి చిన్న బాధ్యతలు స్వీకరించారు. కార్యవర్గ సభ్యులుగా బొడ్డుపల్లి సదయ్య, జంగపల్లి నాగరాజు, నల్లూరి శంకర్, తోటపల్లి కొమురయ్య, జంగపల్లి శ్రీనివాస్, జంగపల్లి శంకర్‌ను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, యువజన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :