సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, జనం పవర్ (ఆగస్టు 16):
పాలమాకుల గ్రామంలో ఘనంగా కొర్వి కృష్ణస్వామి జయంతి వేడుకలు భాగ్యనగర ఆభ్యునత్తికి ఆధ్యుడు కొర్వి కృష్ణ స్వామి, ఆ మహనీయుడు చలవతోనే జంటనగరాల మాస్టర్ ప్లాన్.. ఆయన ఆశయాలను కొనసాగిద్దాం..రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలపడుదాం.
భాగ్యనగర తొలి మేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపకులు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జంటనగరాల అభివృద్ధికి జీవం పోసిన మొదటి వ్యక్తి కృష్ణ స్వామి ముదిరాజ్ అని ముదిరాజ్ కులస్తులు కొనియాడారు.
శనివారం కొరవి కృష్ణస్వామి 138 వ జయంతి పురస్కరించుకొని పాలమాకుల గ్రామంలో కొరివి కృష్ణ స్వామి విగ్రహానికి పూలమాలవేసి ముదిరాజ్ కులస్తులు మరియు గ్రామ పెద్దలు ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు మాట్లాడుతూ ముదిరాజుల ముద్దుబిడ్డ, పేదోళ్ల మహానేత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ అని అన్నారు.ఆయన భాగ్యనగర అభివృద్ధికి అనితర సాధ్యంగా కృషి చేశాడన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, కవిగా, జర్నలిస్టుగా, పేదోళ్ల నాయకుడిగా ప్రజల మనసు దోచుకున్నాడని తెలిపారు. హైదరాబాద్ తొలి మేయర్ గా సేవలందించిన సమయంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసి మహానగర అభివృద్ధిపై చెరగని ముద్ర వేసిన ఘనత ఆయనకే సొంతమన్నారు. ముదిరాజ్ జాతి ఐక్యత కోసం ముదిరాజ్ మహాసభ సంఘాని స్థాపించి మన జాతి అభివృద్ధి కోసం ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. ఆ మహానేత స్ఫూర్తితో మనమంతా ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు.
ఆయన అందించిన పోరాటస్ఫూర్తితో బహుజనులంతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని సమాజ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.









