ప్రజల కోసం కార్పొరేషన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు — ఎమ్మెల్యే మక్కన్ సింగ్

జనం పవర్, రామగుండం ఆగస్టు 16:
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలను శాసనసభ్యుడు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ స్వయంగా పరిశీలించారు. సప్తగిరి కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలతో కలసి సమస్యలను తెలుసుకొని, సంబంధిత కార్పొరేషన్ అధికారులను పిలిపించి చర్యలు సూచించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రధాన డ్రైనేజీలు సక్రమంగా పనిచేయడంతో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వర్షాకాలంలో ప్రజలను మభ్యపెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ముందుండి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చర్యలు చేపడుతోందని చెప్పారు. ప్రధాన నాలాల నిర్మాణం వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండగా, ప్రమాదం రాకుండా ముందస్తు చర్యలే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వర్షాకాలం ముగిసే వరకు అధికారులు, పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిస్తూ, కార్పొరేషన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :