వరంగల్ వై ఆకారం బ్రిడ్జిని తక్షణమే మరమ్మత్తు చేయాలి -ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి డిమాండ్

జనం పవర్, వరంగల్, ఆగస్టు 16:
ఎం సి పి ఐ యు పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శిథిలావస్థలో ఉన్న వై ఆకారం బ్రిడ్జిని నాయకులు కార్యకర్తలు సందర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వరంగల్ వై ఆకారం బ్రిడ్జి 10 సంవత్సరాలు నిండక ముందే బ్రిడ్జి శిథిలావస్థలో మారిందన్నారు. బ్రిడ్జి మొత్తం గుంతలు బడి సలాకు కంకర తేలి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రిపూట వీధిలైట్లు లేక ప్రతిరోజు వేలాదిమంది టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ నడుపుతున్న వాహనదారులు గుంతలలో పడి కాళ్లు చేతులు విరిగి హాస్పటల్ పాలవుతున్నారని అన్నారు కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేసి బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్టర్లు నాణ్యతలేని ఐరన్ సిమెంటు తదితర సామాగ్రిని వాడడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇట్టి విషయంలో అనేకసార్లు ధర్నాలు చేసిన ఆర్ అండ్ బి అధికారులు ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే బ్రిడ్జిని మరమ్మతులు చేసి ప్రజలకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగ్గని మల్లికార్జున్, నగర్ కమిటీ సభ్యులు బావు రామస్వామి, శివ, హమాలి సంఘం నాయకులు అడప యాదగిరి, బిక్షపతి, రాజ్ కుమార్, గట్టయ్య, గుమాస్తా సంఘం నాయకులు రాజేందర్, మనోహర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :