నిరూపయోగంగా ఉన్న బోర్ ను అందుబాటులోకి తెచ్చిన — మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి

జనం పవర్, వనపర్తి, ఆగష్టు 16 :

వనపర్తి జిల్లా కేంద్రంలోని 20వార్డు లో కాశింనగర్ రోడ్డు మార్గంలో నిరూపయోగంగా ఉన్న బోర్ కు శినివారం కొత్త స్టార్టర్ అమర్చి అందుబాటు లోకి తీసుకొచ్చిన వనపర్తి బీఅర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావుపల్లె సునీల్ వాల్మీకి.ఈ సందర్బంగా 20వార్డు ప్రజల కోరిక మేరకు కొత్త సీసీ రోడ్డులు కారణంగా మూడు నెలలుగా నిరూపయోగంగా ఉండడంతో నీటి అవసరాల కోసం బోరు కి ఆటోమేటిక్ స్టార్టర్ ఏర్పాటు చేసి ఉపయోగంలోకి తీసుకరావడం జరిగింది.
ఇప్పుడు వనపర్తి వార్డులలో జరుగుతున్న పనులు అన్ని గత బీఅర్ఎస్ కెసిఆర్ సర్కారు హయాంలో ఎస్ ఎన్అర్ కృషి మేరకు టీయుఎఫ్ఐడిసి ద్వారా కేటీఅర్ మంజూరు చేసిన నిధుల పనులు సెప్టెంబర్ 22, 2023లో టీయుఎఫ్ఐడిసి ద్వారా వనపర్తి మున్సిపాలిటీ కి 50 కోట్లు మంజూరు అయినా జిఓ వివరాలు కూడా ఉన్నాయి. వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రధాత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి రోడ్ల విస్తరణ చేయించి, వనపర్తి వార్డులలో అనేక మౌలిక సదుపాయలు పార్కుల అభివృద్ధి, చెరువులను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దారు. గతంలో నిరంజన్ రెడ్డి సెప్టెంబర్ 2023 లో మంజూరు చేసిన నిధులు అందులో భాగంగానే నేడు వనపర్తి లో జరుగుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ అభివృద్ధి పనులు.
ఈ సందర్బంగా 20వార్డు సభ్యులు వి చంద్రశేఖర్, గణేష్ యాదవ్, పిక్కిలి బాలరాజు, జరిగే రమేష్, బన్నీ నాయుడు, జనీగే రమేష్, బాలరాజు వి, ఎల్జెర్ల రాజు, ముఖ్యులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :