సమాజ సేవలకు గాను గౌరవ డాక్టరేట్‌ ప్రధానం –తెలంగాణ నుండి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్

జనం పవర్, వనపర్తి, ఆగష్టు 16 :

గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్ నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే శనివారం అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు పాండిచ్చేరిలో గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేశారు. 25 సంవత్సరాలుగా సమాజ సేవకు, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటానికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. 25 ఏండ్లుగా ప్రజా సమస్యలపై నిరంతరంగా పోరాడుతూ, సామాజిక సేవలో విశేషంగా పేరు తెచ్చుకున్న వనపర్తి మాజీ కౌన్సిలర్, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. శనివారం మధ్యానం పాండిచ్చేరి రాష్ట్రంలో గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్ ఐపియుజే యూనివర్సిటీ ప్రతినిధులు ఈ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు ఈ గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి సామాజిక సేవ ప్రజల శ్రేయస్సు విభాగంలో సతీష్ యాదవ్ ను ఎంపిక చేశారు.
గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించి, నా సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం గర్వంగా ఉందని, శనివారం కృష్ణాష్టమి రోజున అందుకోవడం నా అదృష్టం అని అలాగే ఇది నాకు మరింత బాధ్యతను పెంచిందనీ సతీష్ యాదవ్ తెలిపారు.నాకు లభించిన గౌరవానికి దోహదపడిన వనపర్తి పట్టణ, జిల్లా ప్రజానీకానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఇది రాబోవు కాలంలో వనపర్తి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉపయోగ పడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :