బూరుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థుల నుండి కంప్యూటర్ విరాళం
బూరుగుపల్లి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 పదో తరగతి పూర్వ విద్యార్థులు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్‌కి కంప్యూటర్ను విరాళంగా అందజేశారు. విద్యార్థుల ఈ సేవా కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హర్షంగా స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో దూలం రాజు, గౌడ నరేష్, ఆడెపు మధు, ఈరవేణి మల్లికార్జున్, తాటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా పూర్వ విద్యార్థుల ఈ సహకారం విద్యార్థులకు సమాచారం నిపుణతను అందించడంలో దోహదపడుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.
Post Views: 136









