జనం పవర్ జన్నారం ఆగస్టు 11
జన్నారం రహదారిపై పశువుల యజమానుల నిర్లక్ష్యంతో రోడ్లపై ప్రమాదాలు జరగుతున్నాయి. అయినా పశువుల యాజమానులకు పట్టింపు లేకుండా పోయింది. ఆవుల యజమానులు వాటిని ఇష్టానుసారంగా వదిలివేయడంలో అవి కాస్తా అక్కడక్కడ గడ్డి తిని రోడ్ల మధ్య లో పడుకుంటున్నాయి. ఆవులు రోడ్డపై సంచరించకుం డా అధికారులు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరుగకుండా చూడాలని, ఆవులు యజమానికి సమాచారం అందించి వారు స్పందించకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
Post Views: 46









