జనం పవర్ – సైబరాబాద్, హైదరాబాద్, ఆగస్టు 11:
హైదరాబాద్‌లో ఈరోజు సాయంత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం 3:00 గంటల నుంచే విడతల వారీగా లాగౌట్స్ ప్రారంభించాలని సూచించారు. ఇలా చేస్తే నగర ట్రాఫిక్‌పై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలు చేయవద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
Post Views: 158









