జనం పవర్/ధర్మపురి ఆగష్టు 11:
ధర్మపురి పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జిల్లా వైద్య అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వైద్య అధికారులతో కలిసి నులిపురుగుల నివారణ మాత్రలను అందజేసారు. అనంతరం మంత్రిగారు మాట్లాడుతూ.. పిల్లలు నిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, తిన్నాప్పుడే కాదు, ఆడిన తర్వాత, టాయిలెట్ వెళ్లిన తర్వాత కూడా శుభ్రత పాటించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని, ముఖ్యంగా నులిపురుగుల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణలో పరిశుభ్రత కీలకం అని అన్నారు. అదే విధంగా ప్రతి ఇంట్లోనూ, పాఠశాలల్లోనూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని సకాలంలో టీకాలు వేయించుకోవాలని ఆరోగ్యంతో పాటు విద్యార్థుల మానసికాభివృద్ధికీ పరిశుభ్రత అవసరమని ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలరని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









