జనం పవర్ భీమదేవరపల్లి ఆగస్టు 11:
కాలేయ వ్యాధి బాధితురాలు వనజకు అండగా ఉంటామని అధికారులు ప్రకటించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన మాడుగుల వనజ కాలేయ మార్పిడి సమస్యతో బాధ పడుతున్న వైనం, ఆర్థిక ఇబ్బందులపై కాలేయ మార్పిడి కోసం ఆదుకోండి శీర్షికన ఆదివారం జనంపవర్ పత్రిక ప్రచురించిన కథనానికి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్పందించారు. ఆమె భర్త కుమారస్వామి చరవాణికి ఫోన్ చేసి వనజ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాలేయ మార్పిడి ఆపరేషన్ కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి రావాలని సూచించినట్లు సి. ఎం. వో. ఓ ఎస్ డి వేముల శ్రీనివాస్ జనంపవర్ కు తెలిపారు. అలాగే ఉన్నతధికారుల ఆదేశాల మేరకు డి ఎం హెచ్ ఓ అప్పయ్య వంగర పి హెచ్ సి వైద్యాధికారి రాజ శేఖర్ ను బాధితురాలి ఇంటికి పంపించి ఆమె ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నిమ్స్ తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చానున్నట్లు డి ఎం హెచ్ ఓ అప్పయ్య తెలిపారు.










