**గంగాధర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కార్డన్‌ & సెర్చ్‌ ఆపరేషన్‌**

 

జనం పవర్ గంగాధర 11: మార్నింగ్ అప్డేట్

గంగాధర పోలీస్‌ స్టేషన్‌ – కార్డన్‌ & సెర్చ్‌ ఆపరేషన్‌

తేదీ: 11-8-2025
స్థలం: మధురానగర్‌, గంగాధర పోలీస్‌ స్టేషన్‌ పరిధి
సమయం:04:30 గంటల నుండి 07:30 వరకు

గ్రామ పెద్దల ఆదేశాల మేరకు, గంగాధర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధురానగర్‌ ప్రాంతంలో సోమ వారం విస్తృతంగా కార్డన్‌ & సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించబడింది.

ఈ ఆపరేషన్‌లో పాత నేరస్థులు అద్దె ఇళ్లలో నివసిస్తున్నారా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 94 వాహనాలు స్వాధీనం చేయబడ్డాయి. వీటిలో:
•    91 మోటార్‌ సైకిళ్లు
•    1 ఆటో రిక్షాలు
•    1 కార్లు
.     1 ట్రాక్టర్

స్థానిక ప్రజలకు సైబర్‌ నేరాలు మరియు వాటి నివారణ మార్గాలపై పోలీస్‌ అధికారులు అవగాహన కల్పించారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే, నేరం జరిగిన గంటలోపే 1930 నంబర్‌ కు ఫోన్‌ చేసి, దొంగిలించబడిన సొమ్మును ఫ్రీజ్‌ చేయించుకోవచ్చని తెలియజేశారు.

మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా, అమ్మకం, వినియోగం చట్టపరంగా నేరమని స్పష్టం చేసి, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. షీ టీమ్‌ సీఐ శ్రీలత సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలపై విద్యార్థినులకు చైతన్యం కల్పించారు.

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు:
కరీంనగర్‌ రూరల్‌ ఇన్‌ఛార్జ్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ N. వెంకటస్వామి గారు, చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్‌ 100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ఈ సందర్భంగా డ్రగ్‌ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. “Say No to Drugs” పోస్టర్‌ను ఏసీపీ ఆవిష్కరించారు.

హాజరైన అధికారులు:
కరీంనగర్‌ రూరల్‌ ఇన్‌ఛార్జ్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ N. వెంకటస్వామి గారు, సీఐ ప్రదీప్‌కుమార్‌ చొప్పదండి, సీఐ శ్రీలత, సీఐ బి. కోటేశ్వరరావు, సీఐ బి. సధన్‌కుమార్‌, సీఐ కె. సంజీవ్‌, గంగాధర ఎస్ఐ బి. వంశీకృష్ణ, ఎస్ఐ జి. నరేంద్ర రెడ్డి, ఎస్ ఐ అంటి నార్కోటిక్ బ్యూరో వి.పుల్లయ్య, ఎస్ఐ కె. రాజు, ఎస్ఐ సాయికృష్ణ, ఎస్ఐ సయ్యద్‌ అన్వర్‌, ఎస్ఐ పి. లక్ష్మారెడ్డి, ఎస్ఐ టీ. నరేష్‌తో పాటు ఇతర పోలీస్‌ సిబ్బంది, స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :