మధురానగర్ గ్రామంలో ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

జనం పవర్, వనపర్తి, ఆగష్టు 09:

తేది 09/08/2025 రోజున గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి మృతి.

వివరాలలోకి వెళితే కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామానికి చెందిన అల్లకుంట గంగారం వయసు 70 సంవత్సరాలు. ప్రస్తుతం మధుర నగర్ లో అతని పెద్ద కొడుకుతో నివాసం ఉంటున్నారు.గత 5 సంవత్సరాల నుండి అతని కుటుంబ సభ్యులు అయిన భార్య, కూతురు, కొడుకు వరుసగా ముగ్గురు చనిపోవడం వల్ల బాధ తట్టుకోలేక మద్యానికి బానిసై ఒంటరితనంతో బాధపడేవాడు. ఒంటరితనం భరించలేక నిన్న ఇంట్లో నుండి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికిన ఆచూకీ దొరకలేదు.ఈరోజు ఉదయం అతని పెద్ద కొడుకు శ్రీనివాస్ ఇంటి షటర్లు తెరిచి చూసేసరికి ఇంట్లోనే వెంటిలేటర్ కి ఉరి పెట్టుకొని మరణించి ఉన్నాడు అని అతని కొడుకు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గంగాధర ఎస్సై బీ వంశీకృష్ణ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :