జనం పవర్,అర్ముర్, ఆగస్టు 09:
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆర్మూర్ పాఠశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం మరియు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాఠశాల లోని విద్యార్థుల తల్లిదండ్రులు పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి రాములు మహారాజు విచ్చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ విద్య తో పాటు సంస్కృతి సాంప్రదాయాలు కూడా పిల్లలకు అవసరమని, విద్య ఎంతో పిల్లల్లో మంచి ఆచార సాంప్రదాయాలు ఉండే విధంగా ఉన్నప్పుడే బాగుంటుందని తెలిపారు. ఇవన్నీ కూడా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లోనే లభిస్తాయని,సరస్వతి శిశు మందిరాలు అంటే మంచి పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు పద్యాలు, శ్లోకాలు,మంచి విద్య బోధించేటటువంటి నిలయాలని తెలిపారు. ఈనాడు దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే వారిలో సరస్వతీ శిశు మందిరాలలో చదువుకున్నటువంటి విద్యార్థులే ముందు అందులో ఉంటారని కొనియాడారు.తదుపరి పాఠశాల ఆవరణలో మొక్క నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవినాథ్ పాఠశాల ప్రభంద కారిణి కమిటీ అధ్యక్షులు వంశీ కృష్ణ, కార్య దర్శి ప్రసన్న గౌడ్, సభ్యులు సడాక్ విజయ్ ,మేనేజ్మెంట్ భాను తేజ్, అభిమన్యు, ప్రిన్సిపల్ వినోద్ కుమార్,
మాతాజీలు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.









