*బీసీలు ఐక్యంగా ఉండి ప్రభుత్వాన్ని గద్దించాలి*

జనం పవర్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం 09:

20న బీఆర్ఎస్ బీసీ గర్జన విజయవంతం చేయండి
బీసీలు ఐక్యంగా ఉండి ప్రభుత్వాన్ని గద్దించాలి
ఢిల్లీలో రేవంత్ రెడ్డి ధర్నా ఒక నాటకం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని చేస్తున్న ధర్నా ఒక నాటకమని, బీసీలు అంతా ఏకమై రెడ్డి రావుల పాలన అంతం చేయాలని బీఆర్ఎస్ బీసీ సంఘం నాయకులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ నమిలి భాస్కరాచారి, కొంగరి రాజయ్యలు అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతున్నది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయనీకేనని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట తప్పిందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు వచ్చే రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాడు తెలంగాణ ఉద్యమం కోసం దుబ్బాక నుండే జరిగిందని, నేడు బీసీ రిజర్వేషన్ కోసం జరిగే ఉద్యమం కూడా దుబ్బాక నుండి మొదలవుతుందన్నారు. ఉద్యమాలకు పురిటి గడ్డ దుబ్బాక అని గుర్తు చేశారు. బీసీలంతా ఐక్యతతో ఉండి 42 శాతం రిజర్వేషన్ కల్పనకు పార్టీలకు అతీతంగా  ఉద్యమాలు చేయాలని అన్నారు. బీసీలు అంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెదించాలని వారన్నారు. ఈనెల 20న బిఆర్ఎస్  బీసీ గర్జన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బీసీ గర్జనను విజయవంతం చేయాలని అన్నారు. బీసీలను అన్యాయం చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ షేర్ల కైలాస్,  బీఆర్ఎస్ బీసీ సంఘం నాయకులు అబ్బుల రాజలింగం, బండి రాజు, పల్లె వంశీకృష్ణ, బాలరాజు, దేవరాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :