జన్నారం మండలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ అంతర్జాతీయ దినోత్సవం…

 

జనం పవర్ జన్నారం ఆగస్టు 09:

జన్నారం మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ సంఘ నాయకులు శనివారం ఉదయం ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ఆదివాసీలంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే తమ హక్కులు సాధించుకోవచ్చు అన్నారు. 1994 డిసెంబర్ 23న జరిగిన 49/214 తీర్మానం ద్వారా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, ప్రపంచ మూలవాసుల అంతర్జాతీయ దశాబ్దం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ మూలవాసుల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ తేదీ 1982లో మానవ హక్కుల ప్రచారం మరియు రక్షణపై ఉప-కమిషన్ యొక్క మూలవాసుల జనాభాపై యూనియన్ వర్కింగ్ గ్రూప్ యొక్క మొదటి సమావేశం జరిగిన రోజును సూచిస్తుంది. జన్నారం మండల అద్యక్షులు తుడుందెబ్బ రాయి సిడం కాలి, రాయిసెంటర్ సారె మెడి, నుర్సుకోల సంపత్, పూసం సోనేరావు, ఆదివాసి సేన మండల అధ్యక్షులు, దుర్వ యెశ్వంత్ రావు, తోటి సంఘం రాష్ట్ర నాయకుడు పెంద్రం రాజేష్, ప్రధాన్ సంఘం మండల నాయకులు, కుర్సింగ ముతి రాజేష్వర్, మండల అద్యష్టలు. కొడప ఆనందరావు, ఉర్వెత దర్ము, తోడషం గంగు పటేల్
మండెడి ననేశ్వర్, మర్సుకొల శ్రావణ్, ఆడ హన్మంతరావు.
మడేవి నాగార్జున్, రాయిసేడం జ్యోరాం, జఫర్ అలీ ఖాన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లక్ష్మీనారాయణ ఆదివాసీ సంఘం నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :