సహజ సిద్ధమైన రాఖీలతో రక్షాబంధన్ నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ పమెల సత్పతి
జనం పవర్, కరీంనగర్, ఆగస్టు 07 :
పర్యావరణ పరిరక్షణ కోసం సహజ సిద్ధమైన రాఖీలతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కోరారు.
రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని యువ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పర్యావరణహిత రాఖీని గురువారం కలెక్టర్ పమేలాసత్పతికి కట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి గ్రామీణ ప్రజలను చైతన్య పరచాలని కోరారు.వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయకులను ప్రతిష్టించే విధంగా మండప నిర్వాహకులను చైతన్య పరచాలన్నారు. రసాయనలతో తయారైన ప్రతిమలు ఎంతో ప్రమాదకరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్తినేని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జక్కని సాయిరాం, సభ్యులు గొట్టెముక్కుల సుష్మిత రెడ్డి,గోపు కిరణ్మయి రెడ్డి, సాహితి, సాత్విక సంస్థ సభ్యులు పాల్గొన్నారు.









