ఘనంగా ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు
జనం పవర్,కమాన్పూర్ ఆగస్టు 7:
కమాన్పూర్లోని ప్రసిద్ధ ఆదివరాహ దేవాలయంలో గురువారం జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఉదయం నిత్యాభిషేకం, గోపూజలతో ప్రారంభమైన కార్యక్రమంలో 108 కళశాలతో అష్టోత్తర శతఘటాభిషేకం జరిగింది. మధ్యాహ్నం స్వామివారికి వెండి కవచాలంకరణ జరగగా,అనంతరం మహాప్రసాద వితరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు మరియు ఈవో కే. కాంతారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Post Views: 45









