బూరుగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ వేడుకలు

బూరుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు
జనం పవర్, గంగాధర, ఆగస్టు 7:

గంగాధర మండలంలోని బూరుగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పండుగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ సభ్యులు విద్యార్థులు, విద్యార్థినీలు, మరియు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

విద్యార్థినీలు తమ సోదరులైన విద్యార్థులకు రాఖీలు కట్టి, సోదరసోదరీ భావాన్ని చాటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఉపాధ్యాయులు రాఖీ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ, సాంప్రదాయ విలువల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. రాఖీ పండుగ అనేది ప్రేమ, రక్షణ, బంధాన్ని సూచించేదిగా వివరించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :