మద్యం సేవించి విధులకు హాజరవుతున్న కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

మద్యం సేవించి విధులకు హాజరవుతున్న కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి

జనం పవర్ బెజ్జంకి ఆగస్టు 7

మండలంలోని చిలాపూర్ పల్లి గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి రఫీ మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతర వేణి మహేష్ ఆరోపించాడు. గురువారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి రఫీ నాలుగు నెలల క్రితం చిలాపూర్ గ్రామపంచాయతీకి బదిలీపై వచ్చాడు. అప్పటినుండి నిత్యం మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు తెలిపాడు. నిత్యం మద్యం సేవించి పంచాయతీ ఆఫీస్ పైన ఉన్న మహిళా సంఘ భవనంలో పడుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటికైనా ఎంపీడీవో, ఎంపీ ఓ మద్యం సేవించి విధులకు హాజరవుతున్న పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :